Thursday, September 7, 2023

అవిశ్వాసి కోరికల ప్రకారం సంఘం నడిస్తే !

ఒక చర్చిలో అవిశ్వాసి ఏమి కోరుకుంటున్నాడో నేను పట్టించుకోలేదు.  

~ జాన్ మెకార్థర్.

సంఘ సహవాసమునకు వచ్చే వారంత విశ్వాసులు కాదు.

చాలా సంఘాలలో రక్షించబడని వారిని సంతోష పెట్టే నిర్ణయాలు చేస్తారు, వారి కోరికలకు అనుగుణంగా బోధిస్తారు. అందువలన సంఘము యొక్క పవిత్రత దెబ్బ తింటుంది, దేవుని ఉద్దేశాలు నెరవేర్చని సమాజముగా ఆ సంఘము మిగులుతుంది.

చిన్న సంఘమైన, వాక్యముకు లోబడి నిర్ణయాలు తీసుకోవాలి.

అవిశ్వాసుల కోరికల మేరకు సంఘములో వస్తున్న మార్పులు:
1. మెరిసే లైట్స్
2. బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్స్
3. పబ్ డాన్సులు
4. ప్రస్పారిటి (అభివృద్ధి) బోధలు
5. పిట్టకథలు, జోకులు
6. నూనెలు, కర్చీఫ్ లు అమ్మడం
7. ఉపవాస ప్రార్థన మరియు ఇతర ప్రార్థన కూడికలో ఒకరి తరువాత ఒకరు ప్రార్థన చేయడం లేకపోవడం (No congregation prayer)
8. లెక్క అప్పగింపు లేకపోవడం (No accountability)
9. ఒకరినొకరు పరిచర్య లేకపోవడం (No one another ministry)
10. సంఘ సభ్యత్వం లేకపోవడం (No church membership)
11. సంఘ క్రమశిక్షణ లేకపోవడం (No church discipline)

అవిశ్వాసుల కోరికలు తీర్చడానికే, చాలా తప్పుడు ఆచారాలు ప్రవేశించాయి, వాక్యానుసారముగా సంఘములో ఖచ్చితముగా ఉండాల్సినవి లేవు.

Saturday, July 1, 2023

హెబ్రీయులకు 10.24-25


కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.


హెబ్రీయులకు 10.24-25


ఏమి చేయాలి? "క్రమం తప్పకుండా సంఘ సహవాసమునకు హాజరు కావాలి".


ఎందుకు హాజరు కావాలి? "ఒకనినొకడు పురికొల్పుకోనుటకు".


ఏమి చేయుటకు పురికొల్పుకోవాలి? "ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును"


పురికొల్పడం ఎవరి పని? "ఒకనినొకడు పురికొల్పుకోవాలి" - ఇది పాస్టర్ మాత్రమే చేసే పని కాదు, సంఘ సభ్యులు అందరూ ఆలాగు చేయాలి.


ఎందుకు మరి ఎక్కువగా మనము సంఘ సమాజముగా గ్యాధర్ అవ్వాలి? "ప్రభువు రాకడ సమీపించుట మనము గమనించగలుగుతున్నాము కాబట్టి".


"కొందరు మానుకొనుచున్నట్టుగా" - ఆ గుంపులో నీవు ఉన్నావా? క్రమం తప్పకుండా సంఘ సహవాసమునకు హాజరుకండి.


"ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము." - కేవలం హాజరవ్వడం కాదు, ఇతరులను వాక్యానుసార జీవితమునకు ప్రోత్సహించుము.