క్రిస్టియన్ ఫిలాసఫీ
Thursday, September 7, 2023
అవిశ్వాసి కోరికల ప్రకారం సంఘం నడిస్తే !
Saturday, July 1, 2023
హెబ్రీయులకు 10.24-25
కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.
హెబ్రీయులకు 10.24-25
ఏమి చేయాలి? "క్రమం తప్పకుండా సంఘ సహవాసమునకు హాజరు కావాలి".
ఎందుకు హాజరు కావాలి? "ఒకనినొకడు పురికొల్పుకోనుటకు".
ఏమి చేయుటకు పురికొల్పుకోవాలి? "ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును"
పురికొల్పడం ఎవరి పని? "ఒకనినొకడు పురికొల్పుకోవాలి" - ఇది పాస్టర్ మాత్రమే చేసే పని కాదు, సంఘ సభ్యులు అందరూ ఆలాగు చేయాలి.
ఎందుకు మరి ఎక్కువగా మనము సంఘ సమాజముగా గ్యాధర్ అవ్వాలి? "ప్రభువు రాకడ సమీపించుట మనము గమనించగలుగుతున్నాము కాబట్టి".
"కొందరు మానుకొనుచున్నట్టుగా" - ఆ గుంపులో నీవు ఉన్నావా? క్రమం తప్పకుండా సంఘ సహవాసమునకు హాజరుకండి.
"ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము." - కేవలం హాజరవ్వడం కాదు, ఇతరులను వాక్యానుసార జీవితమునకు ప్రోత్సహించుము.
Thursday, December 30, 2021
వాగ్ధాన కార్డుల వివాదం - విశ్లేషణ
1. చెయ్యిపెట్టి ఒక్కటి తీస్తే, అది దేవుడు నాకిచ్చినది అయిపోతోందా? ఆ మాట ఎవరితో, ఏ సందర్భలో వ్రాయబడింది అవసరం లేదా?
2. నాకు వచ్చిన ఒక్క వాగ్దానం మాత్రమేనా? బైబిల్ లో ఉన్నవన్ని నాకు వర్తిస్తాయా? అన్ని వర్తిస్తే, దీని ప్రత్యేకత ఏది?
3. నాకు వచ్చిన ఒక్క వాగ్దానం సంవత్సరం మొత్తమునకు సరిపోతుందా? అందుకే ప్రతి దిన వాగ్దానం మొదలు పెట్టారు చాల మంది. తరువాత, ప్రతి గంటకు ఒక వాగ్దానం మొదలు పెట్టుదామా? (ఒక్క వాగ్దానం రోజంతటికి సరిపోదు కదా!)
4. "నేను నీకు తోడైయున్నాను" అనే వాగ్ధానం ఇంకొకరికి వస్తే, నాకు తోడైయుండడా? అందరికీ వర్తిస్తే, నాకు ఆ వాగ్దానం రాలేదు అనడంలో అర్ధం ఏముంది?
4. పిల్లలు మరియు వృద్ధులు తీసినప్పుడు, ఫలించి అభివృద్ధి పొందుడి అని రావడం ఎన్నోసార్లు చూడలేదా?
5. ఎప్పుడో రక్షించబడిన వారికి, నేడు నిన్ను కనియున్నాను అని రావడం చూడలేదా?
6. నేను నీకు విశ్రాంతి కలుగజేతును అనే వాగ్ధానం చూసి, అయ్యో ఈ సంవత్సరం నేను చనిపోతానేమో అని బాధపడిన వారిని చూడలేదా?
7. ఇలా సంబంధం లేకుండా వచ్చినప్పుడు ఏమి సమాధానం చెప్తున్నారు?
8. అభివృద్ధి బోధ ( Prosperity teaching) వైపు ఇవి నడిపించడం లేదా? వాగ్దానాలలో రాసేవన్ని భూలోక దీవెనలే కదా! నీతి, పరిశుద్ధత, నమ్మకత్వం, యథర్థత, శ్రమలు, మొదలైన వాటి గురించి ఈ వాగ్దానాల కార్డ్స్ లో మనం ఒకటైన చూడము కదా!
బైబిల్ లోని వాగ్ధానాలకంటే ఆజ్ఞల మీద కదా మన దృష్టి ఎక్కువగా ఉండాల్సింది! (వాగ్ధానాల నెరవేర్పు దేవుని పని, ఆజ్ఞల పాటింపు మన పని)
నేను పాస్టర్ యోహాన్ మామిడి. మాది సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్.
మా సంఘములో, ఇలాంటి జోస్యాలకు చోటు లేదు.
2022 వ సంవత్సరానికి క్రొత్త మాటనో, క్రొత్త గ్రంథమో ఇవ్వబడలేదు. మాకు దేవుడు ఇచ్చినది 66 గ్రంధాల సమాహారం, పరిశుద్ధ బైబిల్ గ్రంధం. ఇది చాలును.
Wednesday, December 8, 2021
What does the death of Jesus on the cross teach me?
What does the death of Jesus on the cross teach me?
1. It tells me that I am a sinner and I was need of someone to die as a sacrifice to take away my sin.
''so also Christ died once for all time as a sacrifice to take away the sins of many people'' (Hebrews 9.28 NLT)
Bible tells all are sinners. Any religion, any cast, poor or rich, priests or believers, social workers or terrorists, all have sinned one or the other times. There is hell after death as a punishment of sin. It is not a myth. God is not the God of righteousness if He doesn't punish the sinful people.
A righteous person is needed to die as a sacrifice to take away our sins. And no one lived without a sin. So, God took human form and lived without sin and became that sacrifice for us.
Now, believing in what Jesus did on the cross would save a person from eternal punishment (hell)
2. It tells me that Jesus loves me to the extent of laying His life.
''We know what real love is because Jesus gave up his life for us. So we also ought to give up our lives for our brothers and sisters''.(1 John 3.16 NLT).
What is real love?
Who shew the real love towards me?
By doing what, did He show His love is real?
According to Bible,
Real love is loving to the extent of laying life.
Jesus shew that love (called as Agape) towards me.
By taking my sin upon Himself, He went to cross and received the punishment through submitting Himself to the cruel whipping and torturing crucifixion. And rose on the third day and alive now. He is the creator of me and savior of me from my sin and the punishment of my sin. His love towards me didn't keep Him silent when I have no way of getting rid of sin, but that love compelled Him to come down in human form and die on behalf of me. I believed on Him that He is the genuine, true and only God. I received Him into my heart as my Savior and Lord and I have hope that one day I will be with Him in heaven.
He had proved upon the cross how much He loved me. That is to the extent of laying His life. Therefore, Is it wise for me doubt whether He loves me or not, irrespective of what trial I am going through, what need I am facing and what terrible situation I am in?
No, never ever doubt the Love of Christ. Because He loves always. The one who loved and laid life, can love and do whatever more. But He has His way of dealing with us and that is the best method.
Do not doubt the love of Christ.
3. Death of Jesus upon the cross tells me, to what extent I should love...
''We know what real love is because Jesus gave up his life for us. So we also ought to give up our lives for our brothers and sisters''.(1 John 3.16 NLT).
Brothers and sisters referred to believers in local church. We can love each church member with purity to help in needs (physical, spiritual and emotional needs), only when we are most satisfied in the love of Christ. Many do not love the Church (people) because they do not know the love of Christ ( unsaved or spiritual babes).
Meet the needs of fellow believer to the extent of laying life.
“‘You must love the Lord your God with all your heart, all your soul, and all your mind.’ Matthew 22.37 (NLT)
Love God to the extent of laying life. Deny yourself. Die to self. God deserves first place in our lives. Let us love Jesus more than anyone and anything.
Lord Jesus, thank you that great love to the extent of laying your life for me. Please help me to reflect that love towards you and people.
A sinner, saved by the grace of Jesus Christ,
Yohan Mamidi,
ఎవరికి సువార్త అవసరం?
ఎవరికి సువార్త అవసరం?
సువార్త అనగానే బయటి ప్రజలు గుర్తుకు వస్తారు.
మొదట, నీవు సువార్త గురించి ప్రతిదినం ఎక్కువగా తెలుసుకో. సువార్త యొక్క విషయవగాహన బహు విశాలమైనది. సువార్త యొక్క ఔన్నత్యం గూర్చి విను, చదువు, ఆలోచించు, ధ్యానించు మరియు స్పందిస్తు దేవుని స్తుతించు.
| కూతురికి నేర్పుతూ ఒక తండ్రి |
రెండవదిగా, నీ కుటుంబములోని తల్లిదండ్రులు, సహోదర సహోదరీలు, భార్య, భర్త మరియు పిల్లలకు సువార్త చెప్పు. “నేను నా కుటుంబమునకు చెప్పలేను కావున వేరే వారు చెప్తే బాగుండు” అని కొందరు చెప్తున్నారు. అది తప్పు. నీకు నిజమైన మార్పు ఉంటె, నీ కుటుంబము నీ సాక్షమును బట్టి నీ మాట వింటారు. నోవాహు సువార్త ఎవ్వరు పట్టించుకోకున్న, అతని కుటుంబము విన్నది.
| ఒకరితో ఇంకొకరు |
తరువాత, మీ సంఘ సహవాసంలో ఉంటూ రక్షింపబడనివారు, బంధువులు, స్నేహితులు, పొరుగువారు, నీతో కలిసి పనిచేయువారు, చదువుకునేవారు, ప్రయాణం చేయువారు మరియు కొత్త వారు, నీవు వెళ్లే షాపు వారు, ఇతరులు.. వీరికి సువార్త ప్రకటించడం, ఒక సువార్త పత్రిక వెంబడి ఉంచుకొని పరిచయం అయ్యే వారికి ఇవ్వడం, మరియు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం.
| కొందరితో ఒకరు |
నిజ సువార్తను ప్రకటిస్తే, ఎవ్వరూ నమ్మరు అని సువార్తను వక్రీకరించి, యేసుని నమ్మితే ఏవేవో దొరుకుతాయని, తప్పుడు సువార్తను ప్రకటిస్తున్నారు.
“ రక్షణ కలుగజేయుటకు అది (సువార్త) దేవుని శక్తియై యున్నది (రోమా 1.16).”
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్తకు ఏది కలుపాల్సిన అవసరం లేదు. ఆ నిజ సువార్తలో దేవుని రక్షణ శక్తి ఉంది. ఉన్నది ఉన్నట్టు ప్రకటించండి.
~ యోహాన్ మామిడి,
పాస్టర్, సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్
Thursday, January 10, 2019
వివాహ శుభవచనాలు
.......... ( ఒక వివాహితుడు.. యోహాన్ మామిడి )
Monday, October 8, 2018
చర్చి మరియు ఆలయం అనే పదాల కొత్త నిబంధన అర్థం ఏమిటి?
చర్చి పక్కనే ఉన్నానండి, చర్చికి రంగులు వేస్తున్నాము, మందిరములో కుర్చీలు సర్దుతున్నాను, ఆలయం పక్కనే నిలబడ్డాను... అని చెప్పే మాటల్లో, సంఘము సమావేశమవడానికి ఏర్పరచుకున్న భవనమును, చర్చి, ఆలయం మరియు మందిరం అని పిలుస్తున్నట్లు అర్థమవుతుంది.
ఇలా పిలవడం వాక్యానుసారమా? మానవ కల్పితమా?
చర్చ్ అనే ఆంగ్ల పదమును తెలుగులో సంఘము అంటారు. బైబిల్ లో సంఘం (చర్చ్) అనే పధమును వాడిన సందర్భాలను గమనిచుదాం!
సౌలు పాడుచేసింది ప్రజలను, అంతే కానీ భవమును కాదు.
సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను. అపొస్తలుల కార్యములు 8.3
ప్రార్థన చేసింది ప్రజలు, అంతే కానీ భవము కాదు.
పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. అపొస్తలుల కార్యములు 12.5
కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికి .... శుభమని చెప్పి వ్రాయునది. 1 కోరింథి 1.2పౌలు లేఖ వ్రాసింది ప్రజలకు, అంతే కానీ, భవనముకు కాదు. బైబిల్ లో ఎక్కడా కూడా "సంఘ భవనమును", సంఘం (చర్చ్) అని పిలువలేదు.
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? .... దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు. 1 కోరింథి 3.16-17సిలువ మరణము తరువాత క్రీస్తు రక్తములో కడుగబడిన ప్రజలలో దేవుడు నివాసముంటున్నాడు. అతి పరిశుద్ధ స్థలపు తెర చినిగింది. దేవుడు నివసించే స్థలం భవనంలో నుండి మనుష్యులలోనికి వచ్చింది.
"ఆలయం" అనే పదముకు గ్రీకు లో రెండు పదములు వివిధ సందర్భాలలో వేరుగా వాడినారు. అవి "హిరోన్" (heiron) మరియు "నావోస్" (naos).
ఆ రెండు పదాలను బైబిల్ లో వాడిన విధానమును పరిశీలిస్తే ఒక ఆశక్తికర విషయం తెలుసుకోవచ్చు. బైబిల్ లో పరిశుద్ధ స్థలం గురించి మాట్లాడినప్పుడు "నావోస్" అనే పదమును, ఆవరణము గురించి మాట్లాడినప్పుడు "హిరోన్" అనే పదమును ఉపయోగించారు.
యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయము (నావోస్) లోనికి వెళ్లి ధూపమువేయు టకు అతనికి వంతు వచ్చెను. లూకా 1.9యాజకుడు దూపము వేసే స్థలము పరిశుద్ధ స్థలం కావున "నావోస్"అనే పదమును ఉపయోగించారు.
ఆయన దేవాలయము (హిరోన్) లోనికి వచ్చి బోధించు చుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయు చున్నావు? మత్తయి 21.23యేసు ప్రభువు బోధించినది ఆవరణములో కావున "హిరోన్" అనే పదమును ఉపయోగించారు.
అప్పుడు దేవాలయపు (నావోస్) తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను. మత్తయి 27.51అది పరిశుద్ద స్థలంలో జరిగింది కావున "నావోస్" అనే పదమును ఉపయోగించారు.
ఆవరణమునకు ఉపయోగించిన "హీరోన్" అనే పదము కాక, పరిశుద్ధ స్థలం మరియు అతి పరిశుద్ధ స్థలానికి కలిపి వాడిన పదము అయిన "నావోస్" అనే పదమును మనకు వాడడం ద్వారా మనల్ని దేవుడు నివసించే పరిశుద్ధ స్థలముగా చేసియున్నాడు అని అర్థం చేసుకోవచ్చు.మీరు దేవుని ఆలయమై (నావోస్) యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ... దేవుని ఆలయము (నావోస్) పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై (నావోస్) యున్నారు. 1 కోరింథి 3.16-17
కొత్త నిబంధన ప్రకారం, మనమే సంఘం... మనమే ఆలయం.
కావున సంఘము సమావేశమవడానికి ఏర్పరచుకున్న భవనమును, పిలువడానికి "చర్చి, ఆలయం మరియు మందిరం" అనే పదాలు ఉపయోగించరాదు, "సంఘ భవనం, చర్చ్ బిల్డింగ్, చర్చ్ హాల్.." అనేవి ఉపయోగించవచ్చు.
వ్యత్యాసం తెలియకపోతే?
క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమైన ప్రజల మీద ఉంచాల్సిన దృష్టి, కేవలం బిల్డింగ్ పైన ఉంచి, దేవునికి నమ్మకమైన పరిచర్య చేస్తున్నామనుకుంటున్నారు.
మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మత్తయి 16.18పై వచనమును చదివి, సంఘమంటే భవనం అనుకొని, ఒక సంఘ భవనమును ఒక గ్రామంలో నిర్మించడం ద్వారా ఆ పని చేసినామనుకుంటున్నారు. సువార్త ప్రకటించడం లో ఏ మాత్రం ఖర్చు చేయకుండా కేవలం సంఘ భవన నిర్మాణం, ఆ తరువాత ప్రహరీ గోడ, ఆ తరువాత భవన సుందరీకరణ అంటూ సంఘ ధనమంత ఖర్చు చేస్తున్నారు.
సుందరంగా నిర్మింపబడిన సంఘ భవనమును చూసి ఎవరైనా "అబ్బా! ఈ చర్చ్ ఎంత బాగుంది" అంటుంటే, చర్చ్ (సంఘం) బాగుందని ప్రజల ఆత్మీయ స్థితి చూసి చెప్పాలి కానీ, భవనమును చూసి కాదు అని బైబిల్ ఘోషిస్తోంది.
కావున, సంఘ భవనమును చూసో, సంఖ్యను చూసో కాక, వాక్యాన్ని చూసి, ఆత్మీయతను చూసి సంఘములో చేరాలి.
సంఘ భవన నిర్మాణానికి బైబిల్ వ్యతిరేకం కాదు. కానీ, ఆ నిర్మాణాలు విగ్రహాలలా మరిపోకూడదు, వాటిని చూసి మురిసిపోకూడదు. రక్షింపబడని వారికి సువార్త మరియు రక్షింపబడిన వారికి ఆత్మీయ ఎదుగుదల, కొరకు పెట్టె ఖర్చు, భవనాల కొరకు పెట్టె ఖర్చు కంటే ఎక్కువ ఉండాలి.
"7000 మంది పట్టే సంఘానికి కాపరి" అని ఒక మీటింగ్ పోస్టర్ లో కనబడింది. అతను 7000 మందికి కాపరా? లేదా 7000 మంది పట్టే సంఘ భవనానికి కాపరా? ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రజలకు కాక భవనాలకు కాపరులుగా ఉంటున్నారు.
అందుకే..
సంఘ భవనాలు సుందరంగా మరియు మెరిసిపోతూ కనబడుతున్నాయి కానీ, ఆలయాలు శిథిలమైపోతున్నాయి, సంఘాలు కళంకంలో ఉన్నాయి.(ఆలయాలు మరియు సంఘాలు అంటే క్రీస్తు ప్రజలు)ఈ కింది వచనములో, దేవుడు కాపరిగా ఉండమని చెప్పింది, సంఘ భవనమునకా? సంఘముగా?
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అపొస్తలుల కార్యములు 20.28సంఘముకు మరియు సంఘ భవనానికి ఉన్న వ్యత్యాసం క్రైస్తవులకందరికి అర్థమయినప్పుడు, సంఘము యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది.



