ఎవరికి సువార్త అవసరం?
సువార్త అనగానే బయటి ప్రజలు గుర్తుకు వస్తారు.
మొదట, నీవు సువార్త గురించి ప్రతిదినం ఎక్కువగా తెలుసుకో. సువార్త యొక్క విషయవగాహన బహు విశాలమైనది. సువార్త యొక్క ఔన్నత్యం గూర్చి విను, చదువు, ఆలోచించు, ధ్యానించు మరియు స్పందిస్తు దేవుని స్తుతించు.
| కూతురికి నేర్పుతూ ఒక తండ్రి |
రెండవదిగా, నీ కుటుంబములోని తల్లిదండ్రులు, సహోదర సహోదరీలు, భార్య, భర్త మరియు పిల్లలకు సువార్త చెప్పు. “నేను నా కుటుంబమునకు చెప్పలేను కావున వేరే వారు చెప్తే బాగుండు” అని కొందరు చెప్తున్నారు. అది తప్పు. నీకు నిజమైన మార్పు ఉంటె, నీ కుటుంబము నీ సాక్షమును బట్టి నీ మాట వింటారు. నోవాహు సువార్త ఎవ్వరు పట్టించుకోకున్న, అతని కుటుంబము విన్నది.
| ఒకరితో ఇంకొకరు |
తరువాత, మీ సంఘ సహవాసంలో ఉంటూ రక్షింపబడనివారు, బంధువులు, స్నేహితులు, పొరుగువారు, నీతో కలిసి పనిచేయువారు, చదువుకునేవారు, ప్రయాణం చేయువారు మరియు కొత్త వారు, నీవు వెళ్లే షాపు వారు, ఇతరులు.. వీరికి సువార్త ప్రకటించడం, ఒక సువార్త పత్రిక వెంబడి ఉంచుకొని పరిచయం అయ్యే వారికి ఇవ్వడం, మరియు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం.
| కొందరితో ఒకరు |
నిజ సువార్తను ప్రకటిస్తే, ఎవ్వరూ నమ్మరు అని సువార్తను వక్రీకరించి, యేసుని నమ్మితే ఏవేవో దొరుకుతాయని, తప్పుడు సువార్తను ప్రకటిస్తున్నారు.
“ రక్షణ కలుగజేయుటకు అది (సువార్త) దేవుని శక్తియై యున్నది (రోమా 1.16).”
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్తకు ఏది కలుపాల్సిన అవసరం లేదు. ఆ నిజ సువార్తలో దేవుని రక్షణ శక్తి ఉంది. ఉన్నది ఉన్నట్టు ప్రకటించండి.
~ యోహాన్ మామిడి,
పాస్టర్, సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్
No comments:
Post a Comment