Thursday, December 30, 2021

వాగ్ధాన కార్డుల వివాదం - విశ్లేషణ


1. చెయ్యిపెట్టి ఒక్కటి తీస్తే, అది దేవుడు నాకిచ్చినది అయిపోతోందా? ఆ మాట ఎవరితో, ఏ సందర్భలో వ్రాయబడింది అవసరం లేదా?

2. నాకు వచ్చిన ఒక్క వాగ్దానం మాత్రమేనా? బైబిల్ లో ఉన్నవన్ని నాకు వర్తిస్తాయా? అన్ని వర్తిస్తే, దీని ప్రత్యేకత ఏది?

3. నాకు వచ్చిన ఒక్క వాగ్దానం సంవత్సరం మొత్తమునకు సరిపోతుందా? అందుకే ప్రతి దిన వాగ్దానం మొదలు పెట్టారు చాల మంది. తరువాత, ప్రతి గంటకు ఒక వాగ్దానం మొదలు పెట్టుదామా? (ఒక్క వాగ్దానం రోజంతటికి సరిపోదు కదా!)

4. "నేను నీకు తోడైయున్నాను" అనే వాగ్ధానం ఇంకొకరికి వస్తే, నాకు తోడైయుండడా? అందరికీ వర్తిస్తే, నాకు ఆ వాగ్దానం రాలేదు అనడంలో అర్ధం ఏముంది?

4. పిల్లలు మరియు వృద్ధులు తీసినప్పుడు, ఫలించి అభివృద్ధి పొందుడి అని రావడం ఎన్నోసార్లు చూడలేదా? 

5. ఎప్పుడో రక్షించబడిన వారికి, నేడు నిన్ను కనియున్నాను అని రావడం చూడలేదా?

6. నేను నీకు విశ్రాంతి కలుగజేతును అనే వాగ్ధానం చూసి, అయ్యో ఈ సంవత్సరం నేను చనిపోతానేమో అని బాధపడిన వారిని చూడలేదా?

7. ఇలా సంబంధం లేకుండా వచ్చినప్పుడు ఏమి సమాధానం చెప్తున్నారు?

8. అభివృద్ధి బోధ ( Prosperity teaching) వైపు ఇవి నడిపించడం లేదా? వాగ్దానాలలో రాసేవన్ని భూలోక దీవెనలే కదా! నీతి, పరిశుద్ధత, నమ్మకత్వం, యథర్థత, శ్రమలు, మొదలైన వాటి గురించి ఈ వాగ్దానాల కార్డ్స్ లో మనం ఒకటైన చూడము కదా!


బైబిల్ లోని వాగ్ధానాలకంటే ఆజ్ఞల మీద కదా మన దృష్టి ఎక్కువగా ఉండాల్సింది! (వాగ్ధానాల నెరవేర్పు దేవుని పని, ఆజ్ఞల పాటింపు మన పని)


నేను పాస్టర్ యోహాన్ మామిడి. మాది సిరిసిల్ల కమ్యూనిటీ చర్చ్.


మా సంఘములో, ఇలాంటి జోస్యాలకు చోటు లేదు.


2022 వ సంవత్సరానికి క్రొత్త మాటనో, క్రొత్త గ్రంథమో ఇవ్వబడలేదు. మాకు దేవుడు ఇచ్చినది 66 గ్రంధాల సమాహారం, పరిశుద్ధ బైబిల్ గ్రంధం. ఇది చాలును.

2 comments: